రూట్ మార్చిన నారప్ప

- Advertisement -

హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. ఎఫ్ 2 సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. మరోసారి ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పంచేందుకు ఈ సినిమాను ఫిబ్రవరిలో 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు.

సినిమాలు తప్ప వేరే లోకం తెలియని వ్యక్తిగా వెంకటేష్ కు పేరుంది. ఇండస్ట్రీలో వివాదరహితుడిగానూ వెంకీ మామకు మంచి పేరుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు. కాగా వెంకీ తనయుడిని సినమాల్లోకి తీసుకురానున్నాడే వార్త ఇటీవల వినిపిస్తున్నది. దీనిపై వెంకటేష్ ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప, ద్రుశ్యం 2 సినిమాలు సైతం మంచి హిట్ గా నిలిచాయి. కాగా ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన నారప్ప తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఎలక్ట్రిక్ వాహన రంగంలోని దిగ్గ జ సంస్థ ‘బైక్ వో’లో పెట్టుబడులు పెట్టాడు. అయితే ఎంత ఇన్ వెస్ట్ మెంట్ చేసింది మాత్రం వెల్లడించలేదు. ఆయన వ్యూహాత్మక భాగస్వామిగా ఉండారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన సంస్థ అయిన బైక్ వోలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు వెంకీ.

సిద్ధార్థ పశ్చాత్తాపం.. సారీ చెప్పిన హీరో

అయితే సినిమాలు వాయిదా వేసుకోండి..!

జగన్‌ సర్కార్‌ పై వర్మ మరో సంచలన ట్వీట్‌

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -