Sunday, April 28, 2024
- Advertisement -

ఉయ్యాలవాడ చీకటి కోణాల్ని ‘సై రా’ లో చూపిస్తారా?

- Advertisement -

ఈమధ్య కాలంలో బయోపిక్ లు ఎక్కువగానే తెలుగు తెరపై కనిపిస్తున్నాయి. కానీ ఎంత బయోపిక్ అయినప్పటికీ, జీవిత చ‌రిత్ర‌ల్ని ఉన్నది ఉన్నట్టు చూపించకుండా కొన్ని చీకటి కోణాల్ని కప్పి ఉంచడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో కూడా అదే జరగనుందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్ వారికి ఎదురుగా ఎదురొడ్డిన మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశభక్తుడు కాదు.

బ్రిటిష్ వారు భారత దేశం వచ్చిన కొత్తల్లో నరసింహ రెడ్డి వాళ్లకి తొత్తు గానే ఉండేవాడు. కానీ ఒక సందర్భంలో బ్రిటిష్ కలెక్టర్ కి మరియు ఉయ్యాలవాడ కి వచ్చిన ఒక చిన్న గొడవ పెద్దగా మారడంతో నరసింహారెడ్డి కి బ్రిటీషువారికి మధ్య వైరం మొదలవుతుంది. బ్రిటిష్ వారికి తాము పన్ను కట్టాల్సిన అవసరం లేదని తిరుగుబాటు చేయడం మొదలుపెడతాడు. కానీ ఈ విషయాన్ని చూపించకుండా ‘సైరా’ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని దేశభక్తుడు లాగానే చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్త్రీలోలుడట. అతనికి చాలా మంది భార్యలు ఉండేవారట. కానీ ఆ విషయాన్ని చూపించాలంటే ఆ వంశస్తులు మాత్రమే కాక ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర లో చిన్నా చితకా మార్పులు చేసి సినిమాలో చూపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -