Saturday, April 27, 2024
- Advertisement -

అస్సాంలో ఘోర విషాదం.. 18 ఏనుగులు మృతి!

- Advertisement -

అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని నాగార్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు మృతి చెందినట్లు గుర్తించారు. ఏనుగులు ఒకేసారి మృతిచెందిన ఆ ఘ‌ట‌న అంద‌ర్నీ క‌లిచివేసింది. భారీ మూగ‌జీవాలు ఎలా ఒకేసారి ప్రాణం విడిచాయ‌న్న‌దే అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మెరుపు దాడిలో జంతువులు చనిపోయినట్లు తెలుస్తుందని రాష్ట్ర అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

ఏనుగుల మరణం గురించి స్థానిక గ్రామస్థులు మాకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం, ఏనుగులు చనిపోవడానికి అసలు కారణం, మరణాలు సంఖ్య సరైన సమయంలో తెలుస్తుందని అటవీశాఖ పేర్కొంది. తమకు తెలుస్తున్న దానిప్రకారం 18 ఏనుగులు చనిపోయాయని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపినట్టు వెల్లడించారు. ఏనుగులు మృతిచెందిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర అట‌వీశాఖ మంత్రి ప‌రిమ‌ల్ శుక్ల‌బైద్య పరిస్థితిని వీక్షించారు.

ఏనుగులు మృతిచెందిన బాముని ప‌ర్వ‌తాల‌కు వెళ్లిన మంత్రి.. అక్క‌డ ఆ జీవాల‌కు నివాళి అర్పించారు. అట‌వీశాఖ అధికారితో పాటు కొంద‌రు వెట‌ర్న‌రీ బృందం .. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌డుతుంద‌న్నారు. మూడు రోజుల్లోనే ప్రిలిమిన‌రీ ఇంక్వైరీ నివేదిక ఇవ్వాల‌ని ఆయ‌న ఆదేశించారు. అంతే కాదు పూర్తి స్థాయి విచార‌ణ‌తో కూడిన నివేదిక‌ను మ‌రో 15 రోజుల్లోగా స‌మ‌ర్పించాల‌న్నారు.

తెలుగు తెరపై కన్నడ భామలు.. తెలుగోళ్ల మనసు దోచిన భామలు వీళ్ళే!

తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోవొద్దు.. మీకోసమే ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ : వైఎస్ షర్మిల

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -