కరోనాతో కన్నుమూసిన ఎమ్మెల్యే లెహోరామ్ బోరో

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వరుసగా కన్నునమూస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎక్క‌డి నుంచి ఎలా ఎవ‌రిపై ఎటాక్ చేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెలకొంది. కరోనా కాటుకు ఎక్కువగా రాజకీయ నేతలు కన్నుమూస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల మందికి పైగానే కోవిడ్ బారిన ప‌డుతున్నారు. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.

తాజాగా కరోనాతో బాధపడుతూ అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబ‌ర‌ల్ (యూపీపీఎల్‌)కు చెందిన సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో (63) శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో గువాహ‌టిలోని మెడిక‌ల్ కాలేజ్ అండ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై లెహోరామ్ బోరో తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

ఆయ‌న మృతికి అసోం గ‌వ‌ర్న‌ర్, సీఎం, మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అసోంలో క‌రోనా బారిన‌ప‌డి చనిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఈ నెల 26న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఎమ్మెల్యే మ‌జేంద్ర న‌ర్జారీ (68) కరోనాతో చనిపోయిన విషయం తెలిసిందే.

నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

పోలీస్ ని చితక్కొట్టిన స్థానికులు.. వీడియో వైరల్

ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -