Monday, April 29, 2024
- Advertisement -

ఘట్‌కేసర్‌ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!

- Advertisement -

హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ సమీపంలో ఫార్మాసీ విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసులో కొత్త ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. నిందితులైన ఆటో డ్రైవర్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధమూ లేదని గుర్తించారు.

బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారం కేసులో సస్పెన్స్ రాంపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ ఘట్‌కేసర్‌ వరకు సీసీటీవీల పరిశీలన ఒక్కతే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపించిన దృశ్యాలు ఆటోడ్రైవర్ల పాత్రపై పక్కా ఆధారాల్లేవు.. వేరేవాళ్ల మీద అనుమానాల్లేవు అనవసరంగా బద్నాం చేస్తున్నారని అంటున్న ఆటో యూనియన్లు వారు అంటున్నారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు ఫోన్ చేయగానే సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ట్రేస్‌ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు.

యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. కిడ్పాప్‌ లేదు, రేప్‌ లేదన్నారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో టో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్‌, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్‌ భగవత్‌ తేల్చిచెప్పారు.

దుమ్మురేపుతున్న ‘ఉప్పెన’ఫస్ట్ డే కలెక్షన్లు!

అంచ‌నాలను పెంచుతున్న పుష్ప‌!

విభిన్న క‌థాంశంతో రాబోతున్న శ్రియ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -