డ్రగ్స్ కేసు లో ఈ నలుగురు హీరోయిన్ లు ఏం చెప్పారో చూడండి..?

- Advertisement -

సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్ కేసు గా మారిపోయిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు దీపికా పడుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా, శ్రద్ధ కపూర్ లను పోలీస్ లు విచారిస్తుండగా ఆ విచారణలు వారు ఆసక్తికర సమాధానాలు చెప్పడం ఇప్పుడు కొసమెరుపు.. ఎన్‌సీబీ విచార‌ణ‌లో ఆ న‌లుగురు హీరోయిన్లు తాము అస‌లు డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని చెప్పారు. అస‌లు తాము క‌నీసం స్మోకింగ్ కూడా చేయ‌మ‌ని వారు ఎన్‌సీబీ అధికారుల‌కు తెలిపారు.

అలాగే సుశాంత్‌కు ఉన్న డ్ర‌గ్స్ అల‌వాటు గురించి త‌మ‌కు అస‌లు ఏమీ తెలియ‌ద‌ని కూడా వారు విచార‌ణ‌లో తెలిపార‌ని ఎన్‌సీబీ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆ న‌లుగురి ఫోన్ల‌ను ఎన్‌సీబీ సీజ్ చేసింది. దీంతో వాటిని సాంకేతిక బృందం పరిశీలించి త్వ‌ర‌లోనే నిజానిజాల‌ను వెల్ల‌డించనున్నారు. కాగా డ్ర‌గ్స్ కేసులో క‌ర‌ణ్ జోహార్ పేరు చెప్పాలంటూ అత‌నికి చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ ఉద్యోగి క్షితిజ్ ర‌విప్ర‌సాద్‌పై ఎన్‌సీబీ ఒత్తిడి తెచ్చిందంటూ అత‌ని త‌ర‌ఫు న్యాయ‌వాది స‌తీష్ మ‌నీషిండే తాజాగా ఆరోప‌ణ‌లు చేశారు.

- Advertisement -

అయితే వాటిని ఎన్‌సీపీ తోసి పుచ్చింది. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఎన్‌సీబీ ఖండించింది. తాము ఎవ‌రిపై ఎలాంటి ఒత్తిడి తేలేద‌ని ఎన్‌సీబీ స్ఫ‌ష్టంగా తెలిపింది. కాగా క్షితిజ్ ర‌విప్ర‌సాద్‌కు అక్టోబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు రిమాండ్ విధించారని, అత‌ను త‌మ క‌స్ట‌డీలోనే ఉన్నాడ‌ని ఎన్‌సీబీ తెలియ‌జేసింది. అత‌నితోపాటు రియా చక్ర‌వ‌ర్తి స‌హా మ‌రో 20 మంది త‌మ అదుపులో ఉన్నార‌ని ఎన్‌సీబీ తెలిపింది. అయితే ప్ర‌సాద్ విచార‌ణ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని కూడా ఎన్‌సీబీ వెల్ల‌డించింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -