Tuesday, May 7, 2024
- Advertisement -

25 అసెంబ్లీ, 3 ఎంపీ..జనసేనకు ఇదే ఫైనల్!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక్కరోజే రెండు సార్లు భేటీ అయ్యారు. దీంతో జనసేనకు ఇచ్చే స్థానాలపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. అయితే వీరిద్దరి సమావేశం ఈనెల 8కి వాయిదా పడగా ఆరోజు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. 25 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పవన్ పార్టీకి ఇవ్వనున్నారు చంద్రబాబు. తొలుత పవన్ ఒప్పుకోకపోయినప్పటికి చంద్రబాబు చివరకు కన్విన్స్ చేసినట్లు సమాచారం. .

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్‌, యలమంచిలి, భీమవరం, పోలవరం, బెజవాడ వెస్ట్‌, తెనాలి, దర్శి జనసేనకే ఇచ్చినట్లు సమాచారం. ఇక 14వ తేదీన పాలకొల్లులో టీడీపీ – జనసేన ఉమ్మడి సభలో మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు జనసేనకు కన్ఫామ్ కాగా అనకాపల్లి లేదా తిరుపతిలో ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ రెండు చోట్ల పోటీచేయనుండగా ఏ స్థానాలు అనేదానిపై 8 తర్వాతే క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -