Monday, April 29, 2024
- Advertisement -

ముద్రగడ ఎవరి వైపు?

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నిదూకుడు పెంచాయి. ఇక ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చగా టీడీపీ సైతం ఇదే బాటలో నడుస్తోంది. ఇక ఏపీ రాజకీయాలన్ని ప్రస్తుతం కాపు ఉద్యమనేత ముద్రగడ చుట్టే తిరుగుతున్నాయి. తొలుత జనసేన తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానంగా ముద్రగడ టీడీపీ లేదా జనసేనలో చేరనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. ముద్రగడను బుజ్జగించేందుకు కీలక నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ మేరకు ముద్రగడతో జగన్ కోటరిలోని వ్యక్తి ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు..ముద్రగడతో మంతనాలు జరిపారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, మీకు సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ఈసారి కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని చెప్పడం మరింత హీట్ పెంచేసింది. ఈసారి మా నాన్న, నేను ఇద్దరం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో ఎక్కడి నుండి పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా వైసీపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు ముద్రగడ కోసం ఎదురుచూస్తుండగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -