Tuesday, May 7, 2024
- Advertisement -

ముందస్తుపై తేల్చేసిన జగన్..అయినా సందేహమే!

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా..?టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయా..?ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ వ్యాఖ్యలతో ముందస్తుకు పుల్ స్టాప్ పడినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్‌ని గమనిస్తే ముందస్తు ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బయటకు రాకముందే జగన్ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేస్తానని ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగానే పొలిటికల్ సిచ్యువేషన్ కనిపించింది. అయితే ముందస్తు పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు జగన్.

ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని ఎమ్మెల్యేలతో తేల్చిచెప్పారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనుండగా ఈ ఆరు నెలలు కీలకమని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉండాలని సూచించారు. షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే వైసీపీ నేతలకు కూడా ముందస్తు లేదని క్లారిటీ ఇచ్చేశారు.

సర్వే రిపోర్టులు, వారి పనితీరు నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తామని …టికెట్ దక్కని వారు నిరాశకు గురికావొద్దని చెప్పారు. టికెట్ దక్కని వారు కూడా తమవారేనని…వారికి నామినెటెడ్ పోస్టులు ఇస్తానని చెప్పారు. ఇక ముందస్తు లేదని జగన్ చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు అయ్యేవరకు చంద్రబాబు బయటకు రారా అన్న సందేహన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే కేసుల మీద కేసులు చంద్రబాబుతో పాటు లోకేష్‌పై నమోదవుతుండటంతో రోజురోజుకు బాబు బెయిల్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలతో ముందస్తుకు బ్రేక్ పడినట్లే అని భావించాల్సిన అవసరం లేదని కొంతమంది నేతలు వాదిస్తున్నారు. ముందస్తు ఉందా లేదా అన్నది తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్‌లో విడుదల కానుండగా అప్పటివరకు వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -