Wednesday, May 8, 2024
- Advertisement -

ఏపీలో ఏడు గ్యారెంటీలతో!

- Advertisement -

దక్షిణాదిన తిరిగి పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. ఇక తెలంగాణలో రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తొలిసారి అధికారంలోకి రాగా ఏపీలో సైతం ఉనికిని చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీనియర్ నేత మాణికం ఠాగూర్‌ని ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జీగా నియమించగా రెండో ఎత్తుగడలో భాగంగా వైఎస్ఆర్ కూతురు షర్మిలను పార్టీలోకి చేర్చుకుంది.

త్వరలోనే కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలుంటాయని ప్రచారం జరుగుతుండగా 25 ఎంపీ స్థానాలకు ఇంఛార్జీలను సైతం నియమించింది కాంగ్రెస్. ఇక ఏపీ ఎన్నికల బరిలో కీలక హామీలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ప్రజాకర్షకమైన ఏడు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజు వెల్లడించారు. ఏడు గ్యారెంటీలకు తోడు వై నాట్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పుకొచ్చారు. అలాగే దశల వారీగా భారీ బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తొలుత ఒంగోలులో యువ భేరి సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక త్వరలోనే షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారని విస్తృత ప్రచారం జరుగుతుండగా త్వరలోనే క్లారిటీ రానుంది. మరి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -