Thursday, May 2, 2024
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లీక్?

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలను పూర్తి చేసింది. ఇక నేటి నుండి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్. ఇవాళ ఐదు నియోజకవర్గాల సమావేశాలు జరగనుండగా మొత్తం ఫిబ్రవరి 10లోపు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలను పూర్తి చేయాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎందుకు ఓటమి పాలయ్యాం,ఏ సామాజిక వర్గాలను ఆకట్టుకున్నాం, ఎవరు బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు? అనే దానిపై సమీక్ష చేపట్టనున్నారు. వీటి ఆధారంగా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ సీట్లు ఇచ్చి దెబ్బతినగా ఈసారి పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… జహీరాబాద్‌ లోక్‌సభ నుండి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మహబూబాబాద్ నుండి మాలోత్ కవిత, ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు సిట్టింగ్‌లకు సీటు దాదాపు ఖాయమైంది. పెద్దపల్లి లోక్‌సభ నుండి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతతో పాటు కొప్పుల ఈశ్వర్, మెదక్‌ లోక్‌సభ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ నుండి సిట్టింగ్ ఎంపీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వరంగల్‌ లోక్‌సభ నుండి పసునూరి దయాకర్, మాజీ మంత్రి రాజయ్య, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నుండి సిట్టింగ్ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కరీంనగర్ నుండి వినోద్ కుమార్, ఆదిలాబాద్ నుండి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ కవిత,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మల్కాజిగిరి నుండి శంభీపూర్ రాజు, బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నుండి తలసాని సాయికిరణ్, రావుల శ్రీధర్ రెడ్డి, నల్గొండ నుండి పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, భువనగిరి నుండి గుత్తా అమిత్ రెడ్డి, బాలరాజు యాదవ్, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుండి పి.శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఒకరి పేరు దాదాపు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -