Wednesday, May 1, 2024
- Advertisement -

వాట్ నెక్ట్స్‌…హైదరాబాద్‌కు బాబు..ఢిల్లీకి లోకేశ్!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక తమ అభిమాన నేత బయటకు రావడంతో ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రాజమండ్రి జైలుకు తరలివచ్చారు. ఇక దారి పొడవునా చంద్రబాబుకు స్వాగతం పలికారు. అయితే హైకోర్టు బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించారంటూ ఏపీ సీఐడీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో తిరుమల పర్యటన రద్దైంది.

అయితే ఇంతవరకు బాగానే ఉన్న చంద్రబాబుకు ఉంది నాలుగు వారాల సమయం మాత్రమే. అంటే ఈ నెల 28న సాయంత్రం 5 గంటల లోపు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏం చేసినా ఇలోపే చేయాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయనున్నారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు తర్వాత ఆస్పత్రిలో చికిత్స చెకప్ చేయించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు కోర్టు కేసులకు సంబంధించి ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంలో విచారణలో ఉండగా ఒకవేళ ఈ పిటిషన్‌ బాబుకు అనుకూలంగా వస్తే ఆయన బయటపడ్డట్లే. ఈ కేసుతో పాటు చంద్రబాబుపై ఉన్న ఇతర కేసుల విషయంపై కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపున్నారు లోకేష్. అలాగే తన పర్యటనలో భాగంగా ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రిమాండ్ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ ఏంటనే దానిపై మాత్రం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -