Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబు లేఖ ఫేక్…తేల్చేసిన పోలీసులు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ యాభై రోజులు పూర్తయింది. బాబు హయాంలో జరిగిన అవినీతి పై కేసుల మీద కేసులు నమోదవుతుండటంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాకపోవడంతో ప్రధానంగా బాబు భద్రత, ఆరోగ్యం వంటి వాటిని టార్గెట్ చేసి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక చంద్రబాబు తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లేఖ రాయడం,మావోల పేరుతో వచ్చిన లెటర్ నేపథ్యంలో స్పందించారు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్. రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని…ఇక మావోయిస్టుల పేరుతో వచ్చిన లెటర్ ఫేక్ అని తెల్చి చెప్పారు. జైల్లోకి ఎవరూ దొంగతనంగా కెమెరాను తీసుకురాలేదన్నారు. దొంగతనం కేసులో జైలుకి వచ్చిన ఓ నిందితుడి వద్ద బటన్ కెమెరా ఉంటే గుర్తించి పోలీసులకు అప్పజెప్పామన్నారు.

ప్రతిరోజు జైలుకి చాలా లేఖలు వస్తుంటాయని… వాటిని పరిశీలిస్తూనే ఉంటాం. వాటిలో చాలావరకు ఫేక్ లెటర్లే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు బరువు 65 కిలోలు, ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. స్నేహ బ్యారక్ ఎక్కడుందో నిందితులకు తెలుసు కానీ బ్యారక్ లో చంద్రబాబు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని చెప్పారు రవి కిరణ్. జైలులో అత్యంత సెక్యూరిటీ అందించగలుగుతున్నాం అని కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -