Thursday, May 2, 2024
- Advertisement -

వివాదంలో ఎమ్మెల్సీ కవిత!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరగా సినీ రంగం, రాజ‌కీయ రంగం, పారిశ్రామిక రంగాల‌కు చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక హైదరాబాద్‌లో ఓటు వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల సంఘానికిఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యా రు.

దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని చెబుతూనే తెలంగాణ‌లో మూడో సారి కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. అలాగే ద‌క్షిణాది రాష్ట్రాల్లో మూడోసారి వ‌రుస‌గా ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశం కేసీఆర్‌కు క‌ల్పించాల‌ని మాట్లాడారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. ఇలా ఒక పార్టీకిఓటేయాల‌ని కానీ.. ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌డం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరనుంది కాంగ్రెస్. మొత్తంగా కవిత చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -