Tuesday, April 30, 2024
- Advertisement -

నరసన్నపేట..ధర్మానదే గెలుపు!

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం..వెలమ సామాజికవర్గం నేతలకు పెట్టని కోట. ఏ పార్టీ అభ్యర్థి అయినా వెలమలకే సీటు ఇవ్వనుండగా వారే గెలవడం ఆనవాయితీ. అంతేకాదు నరసన్నపేట నియోజకవర్గం సంచలన రాజకీయాలకు కేరాఫ్. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 13 వేల ఓట్లు ఉండగా వెలమ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. రెండో స్థానంలో కళింగ, మూడో స్థానంలో కాపు ఓటర్లు ఉన్నారు.

1952లో జరిగిన తొలి ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్నిసార్లు వెలమ నేతలే గెలిచారు. ప్రధానంగా ధర్మాన,బగ్గు,శిమ్మ కుటుంబాల నుండే ఈ నియోజకవర్గంలో గెలవడం ఆనవాయితీ. ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా 2004 నుండి శ్రీకాకుళం నియోజకవర్గానికి మారారు. ప్రస్తుతం వైసీపీ తరపున ధర్మాన కృష్ణదాస్‌ తో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తలపడుతున్నారు.

వీరిద్దరూ మూడోసారి తలపడుతుండగా ఇద్దరిది ఒకే గ్రామం. 2014లో బగ్గు రమణమూర్తి గెలవగా 2019లో ధర్మాన కృష్ణదాస్ గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈసారి గెలిచితీరాలని ఇద్దరు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి బాటలు వేస్తాయని కృష్ణదాస్ ధీమాతో ఉన్నారు. అలాగే ధర్మాన ఫ్యామిలీకి అడ్డాగా ఈ నియోజకవర్గం ఉండగా ఇది కూడా తనకు కలిసివచ్చే అంశమని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -