Tuesday, April 30, 2024
- Advertisement -

ఎచ్చెర్ల వార్..గెలుపెవరిది?

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల. ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉండటంతో ఈసారి ఎచ్చెర్లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పడగా టీడీపీ ఆవిర్భావం తర్వాత 183 నుండి 1999 వరకు టీడీపీదే గెలుపు. ఇక్కడి నుండి గెలిచిన ప్రతిభా భారతి స్పీకర్‌గా కూడా పనిచేశారు.

2009లో జనరల్ నియోజకవర్గంగా ఎచ్చెర్ల మారగా 2009లో కాంగ్రెస్,2014లో టీడీపీ,2019లో వైసీపీ గెలుపొందింది. ఈసారి ఎచ్చెర్ల బరిలో పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేస్తోంది. టీడీపీ తరపున ఈశ్వరరావు పోటీ చేస్తుండగా వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు.

ఇక ఎచ్చెర్ల సీటు కోసం టీడీపీలో గట్టి పోటీ నడిచింది. కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీడీపీ అధినేత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వగా ఈశ్వరరావు బరిలో ఉన్నారు. ఇక కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును,కలిశెట్టికి విజయనగరం ఎంపీ సీటును ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

సీఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు కలిశెట్టి. కూటమి అభ్యర్థికి ఈసారి భంగపాటు తప్పదని చెబుతున్నారు. మరి ఎచ్చెర్ల ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -