Wednesday, May 1, 2024
- Advertisement -

గుంతకల్లులో ఆసక్తికర పోరు..విజయం వైసీపీదేనా?

- Advertisement -

కర్నూల్ జిల్లా గుంతకల్లులో ఈసారి ఆసక్తికరపోరు జరగనుంది. టీడీపీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం బరిలో నిలవగా వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ఎన్నికల క్షేత్రంలో ఉన్నారు. రైల్వే ఉద్యోగులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,52,352. రైల్వే ఉద్యోగులతో పాటు క్రిస్టియన్ జనాభా అధికంగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో.

2009లో టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గుప్తా గెలుపొందగా 2014లో ఆర్ జితేంద్ర గౌడ్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గుప్తాను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైఎస్సార్‌సీపీకి చెందిన వై వెంకటరామి రెడ్డి తన ప్రత్యర్థి జితేంద్ర గౌడ్‌పై గెలిచారు. ఇక ఈ సారి ఎన్నికల్లో జితేంద్రను పక్కన పెట్టి జయరాంకు టీడీపీ టికెట్ ఇచ్చింది.

గుంతకల్‌ టీడీపీ అభ్యర్థిగా జయరాం పేరును ప్రకటించగానే మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌తోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించారు. అయితే తర్వాత టీడీపీ అధిష్టానం అసంతప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగగా ఇంకా కొంతమంది జయరాంకు సహకరించడం లేదు. మరోవైపు వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధికి తోడు జగన్ సర్కార్ సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. ఇక వైసీపీ నుండి టీడీపీలో చేరిన జయరాంకు బుద్ది చెప్పేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా గుంతకల్లు పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -