Sunday, April 28, 2024
- Advertisement -

నారింజ పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

- Advertisement -

నారింజ పండ్లు కాలంతో సంబంధం లేకుండా అన్ని సీజ‌న్ల లో ప్ర‌స్తుతం మార్కెట్ లో ల‌భిస్తున్నాయి. చూడ్డానికి నిగ‌నిగ‌లాడుతూ క‌నిపించే ఈ పండ్లు రెండు వేరియంట్ల‌లో ఉంటాయి. అవి పుల్ల‌గా ఉండేవి.. మ‌రొక‌టి పుల్ల‌పుల్ల‌గా తియ్య‌ద‌నం క‌లిగి ఉండేవి. ఈ పండ్లు తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ లో వీటి ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అంద‌రికీ అందుబాటులో ఉంటాయి.

నారింజ పండ్లు తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎందుకంటే వీటిలో విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు, మ‌ధుమేహం, కాలేయ వ్యాధులను నివారించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. బ‌ల‌హీనంగా ఉన్న‌వారిలో త్వ‌రితగ‌తిన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించడంలో కీల‌కంగా ఉంటాయి.

వీటిని నిత్యం ఆహారంతో తీసుకోవ‌డంతో కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలోనూ ప్ర‌ముఖపాత్ర పోషిస్తాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని దూరం చేయ‌డంతో పాటు రాత్రిపూట నారింజ పండ్లు తిన‌డం వ‌ల్ల మ‌రుస‌టి రోజు సుఖ విరేచనం అవుతుంది. వెంట్రుక‌లు ఊడిపోతున్న‌వారు వీటిని నిత్యం తింటే ఈ స‌మ‌స్య త‌గ్గిపోతుంది. అలాగే, చ‌ర్మ సంబంధ వ్యాధులు రాకుండా నారింజ‌లో ఉంటే ఔష‌ధ గుణాలు కాపాడుతాయి. ఇంకెందుకు ఆల‌స్యం.. మీకు అందుబాటులో ఉంటే నారింజ‌ను తినేసేయండి మ‌రి..!

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

వేడి నీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు !

‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేప‌నున్నదీపిక !

ప్రియా ప్రకాష్ వారియర్ తో నితిన్ రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -