Monday, April 29, 2024
- Advertisement -

ఏపీలో బీజేపీ ఖాతా తెరిచేనా?

- Advertisement -

అనేక తర్జనభర్జనల అనంతరం ఏపీలో టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ డిమాండ్ల ముందు చంద్రబాబు – పవన్ తలవంచక తప్పలేదు. అందుకే ఒక్కశాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాలు దక్కాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఏపీలో బీజేపీ ఏ మేరకు సత్తాచాటుతుంది అన్నదే ప్రశ్న.

ఇక త్వరలో బీజేపీ లిస్ట్ రిలీజ్ కానుండగా హస్తినకు పయనమయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఆశావాహుల జాబితాతో వెళ్లగా బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరపనుంది. ఇక ఇదే సందర్భంగా టీడీపీతో పొత్తుపై రాష్ట్ర బీజేపీ నేతలు కొంతమంది అసహనంతో ఉన్నారనే విషయాన్ని చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీ ప్రాబల్యమే లేదు. ఒక్క ఎంపీ,ఎమ్మెల్యే సీటును గెలుచుకోలేదు. దీనికి తోడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఏపీలో బీజేపీ బలం చాలా తక్కువ.దీనికి తో డు బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో గెలవడం కత్తిమీద సామే.ఇక ఎంపీల విషయానికొస్తే అంతే సంగతులు. పూర్తిగా టీడీపీ,జనసేన కేడర్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు వ్యూహాలు ఎలా ఉంటాయి..ఈసారైనా బీజేపీ ఖాతా తెరుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -