Monday, April 29, 2024
- Advertisement -

పీఠాపురం..పవన్‌ రాంగ్ స్టెప్‌!

- Advertisement -

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్ధానాల నుండి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఇక తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారా అన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది. రోజుకో నియోజకవర్గం పేరు ప్రచారంలో ఉండగా చివరకు వాటికి పుల్ స్టాప్ పెడుతూ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.

అయితే పవన్ పోటీ చేసే స్థానంపై ఇప్పుడు ఏపీలో చర్చజరుగుతోంది. పవన్ ఎంచుకున్న స్థానం కరెక్టేనా?ఒక వేళ ఓడిపోతే పవన్‌ రాజకీయానికి పుల్ స్టాప్ పడినట్లేనా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్‌ కేవలం కాపు ఓటు బ్యాంకును నమ్ముకునే పీఠాపురంను ఎంచుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను గమనిస్తే పిఠాపురంలోనే కాపు ఓట్లు ఎక్కువ. ఇది ఒక్కటి తప్ప పవన్‌కు పెద్దగా కలిసివచ్చేది ఏమి లేదు. దీనికి తోడు స్థానిక టీడీపీ నేతలు పవన్‌కు సహకరించే పరిస్థితి లేదు.

ఇక వైసీపీ…పవన్‌ పోటీ చేసే స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పిఠాపురంలో గట్టి పట్టుఉన్న వంగా గీతను బరిలోకి దింపింది. ఎంపీగా ఈ నియోజకవర్గంలో గీతకు మంచి పట్టుఉంది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిని పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక ఇంఛార్జీగా నియమించడం, త్వరలోనే సీఎం జగన్ పర్యటన ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ గెలవడంతో పార్టీ నుండి కనీస సీట్లను సాధించడం జనసేనానికి ఎంతో ముఖ్యం. కానీ వైసీపీ ఎత్తుగడలను ఎదుర్కొని పవన్‌ గెలవడం సవాలేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -