Sunday, April 28, 2024
- Advertisement -

పేద పిల్లలు… పెద్ద చదువులు

- Advertisement -

మనసుంటే మార్గం ఉంటుంది.. పేదలకు మంచి చేయాలన్న తలంపు పాలకుడికి ఉంటే ఖచ్చితంగా వారికి మేలు చేకూరుతుంది.. దీనికోసం ఆ పాలకుడు ఎంత కష్టమైనా ప్రయత్నం చేస్తాడు.. ఆంధ్రాలో అదే ఇప్పుడు జరుగుతోంది..

ఇన్నాళ్లూ కేవలం బాగా డబ్బున్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన విద్య ఇప్పుడు పేదలకూ అందించేందుకు చర్యలు మొదలయ్యాయి

ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను అమలు చేస్తున్నారు.

ఐబీ సిలబస్‌ అమలుపై ఏపీ ప్రభుత్వంతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడి తమ మేథా పటిమను నిరూపించుకోనున్నారు .

2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు.

2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.

ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -