Thursday, May 2, 2024
- Advertisement -

సింగరేణి ఎన్నికలు..కేసీఆర్ షాకింగ్ నిర్ణయం!

- Advertisement -

ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఇక ఈ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీతో పాటు కాంగ్రెస్ అనుబంధ ఏఎన్‌టీయూసీ పోటీ చేస్తుండగా ఇప్పటివరకు అధికార సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయడం లేదని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్. ఇక గులాబీ బాస్ నిర్ణయంతో పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ నేతలు రాజీనామా చేస్తుండగా ఆ సంఘం నేతలు కీలక సమావేశం నిర్వహించారు. నేతలంతా ముకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని మిర్యాల రాజి రెడ్డి వెల్లడించారు.

బీఆర్ఎస్ సర్కార్ సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుండటంతో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు నిర్ణయంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ….ఏఐటీయూసీకి మద్దతివ్వగా స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందింది టీబీజీకేఎస్. ఇప్పుడు విడిగా పోటీ చేస్తుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -