టీడీపీ – జనసేన పొత్తుతో ఎవరికి లాభం జరుగుతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు జనసేన నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి షాకివ్వగా రీసెంట్ నెల్లూరు జిల్లాకు చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
జనసేనకు రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వినోద్ రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు. ఎంపీ విజయసాయి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించగా వినోద్‌తో పాటు మరికొంతమంది నేతలు వైసీపీలో చేరారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి జనసేన తరపున పోటీచేశారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటును మాజీ మంత్రి నారాయణకు ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన జనసేనను వీడారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేశానని చెప్పారు. ఏనాడూ ఆత్మ విశ్వాసం కొల్పోలేదని కానీ అంతర్గతంగా జనసేనలో జరుగుతున్న పరిణామాలను తనను బాధించాయన్నారు వినోద్ రెడ్డి. అందుకే పంటి బిగువన అవమనాలు భరించలేక జనసేనను వీడి వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల్లో మరింత మంది నేతలు జనసేనను వీడనున్నట్లు తెలుస్తోంది.
