Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీలోకి ముద్రగడ!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టీడీపీ లేదా జనసేనలో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేరుతారని వార్తలు వస్తుండగా వాటిపై మాత్రం క్లారిటీ రాలేదు. పవన్ తనను కలవకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు ముద్రగడ. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముదగ్రడ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ 12న ముద్రగడ వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ముద్రగడతో జక్కంపూడి గణేష్ భేటీ కాగా ఎంపీ మిథున్ రెడ్డి సైతం ముద్రగడతో ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ముద్రగడ రీ పొలిటికల్ ఎంట్రీ ఖరారైనట్లేనని ఆయన అనుచరులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా దీనిపై ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి పవన్ సైతం ఘాటు వ్యాఖ్యలే చేయగా ఇదే పవన్ – ముద్రగడ మధ్య దూరం పెంచడానికి కారణమైంది. పిఠాపురం నుండి ముద్రగడ లేదా ఆయన తనయుడు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -