Tuesday, April 30, 2024
- Advertisement -

జనంలోకి లోకేష్..ప్రజలను ఆకట్టుకుంటారా?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఇక ఎన్నికల రణరంగంపై దృష్టి సారించింది టీడీపీ. చంద్రాబు మరిన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తుండగా టీడీపీని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను నారా లోకేష్ భుజాన వేసుకోనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 27 నుండి లోకేష్ యువగళం యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.

రెండు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పాదయాత్రను నిలిపివేయగా ఇప్పుడు అక్కడి నుండే యాత్రను ప్రారంభించనున్నారు. ఇక చంద్రబాబు యాత్ర 2024 జనవరి రెండోవారం వరకు జరగనుంది. ఇక ఓ వైపు లోకేష్ మరోవైపు భువనేశ్వరి ఇద్దరు ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

లోకేశ్ తన యాత్ర ద్వారా యువతకు దగ్గరకానుండగా భువనేశ్వరి..చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన వారిని పరామర్శించనున్నారు. భువ‌నేశ్వ‌రి పర్యటనలపై కూడా రూట్‌ మ్యాప్‌ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు ప్రజల్లో ఉండేలా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తుండగా ఇది ఎంతవరకు కలిసి వస్తుందో వేచిచూడాలి.

ఎందుకంటే అవతలి వైపు ఉంది వైఎస్ జగన్. ఇప్పటికే రెండోసారి అధికారంలో వచ్చేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. మరి టీడీపీ నేతలు జగన్‌కు మించిన ప్రణాళికను రచించి ముందుకు వెళ్తారా..ఏ మేరకు ప్రజలకు ఆకట్టుకుంటారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -