Wednesday, May 1, 2024
- Advertisement -

నెల్లూరు రూరల్..కోటంరెడ్డికి చెక్‌ పడేనా?

- Advertisement -

నెల్లూరు రూరల్‌లో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. వాస్తవానికి 2014,2019లో వైసీపీ తరపున విజయం సాధించారు కోటంరెడ్డి. అయితే ఆ తర్వాత రాజకీయ విభేదాలతో టీడీపీలో చేరారు.

వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సీనియర్ పొలిటిషన్, కాంట్రాక్టర్. 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా 2019లో నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుపై 1,48, 571 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

అయితే పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్నకోటంరెడ్డికి జనసే నుండి మద్దతు కరువైంది. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి ఇటీవల ఆ పార్టీని వీడి వైసీపీలో చేరగా ఆయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు పార్టీ మారారు. 2019లో నెల్లూరు రూరల్ నుండి పోటీ చేసిన చెన్నారెడ్డికి 9 వేల ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు టీడీపీకి మైనస్ కానుండగా బీజేపీ సైతం కోటంరెడ్డితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభాకర్ రెడ్డికి అన్నివర్గాల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుండటంతో నెల్లూరు రూరల్‌లో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -