Tuesday, April 30, 2024
- Advertisement -

శ్రీకాకుళం టీడీపీకి కొత్త పంచాయితీ!

- Advertisement -

శ్రీకాకుళం టీడీపీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఇప్పటికే రెబల్స్ ట్రబుల్స్‌తో ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలకు కళింగ,తూర్పు కాపు సామాజిక వర్గం నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

వీటిలో ఒక్క స్థానాన్ని అయినా కళింగ, తుర్పుకాపు సామాజికవర్గానికి కేటాయిస్తారని ఆశీంచారు. కానీ అలాంటిదేమీ జరగేలదు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కళింగ సామాజికవర్గం ఓటర్లు గణనీయంగా ఉండగా, తుర్పుకాపు సామాజికవర్గానికి చెందిన వారు రెండో స్థానంలో ఉన్నారు.

కానీ వీరికి కూటమి తరపున పెద్దగా ప్రాతినిధ్యం దక్కలేదు. ఇదే అంశం టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి నేతల సమావేశంలో చర్చకు వచ్చింది. కళింగ, తుర్పుకాపు వర్గాలతో పోల్చితే వెలమ సామాజికవర్గానికి మూడు అసెంబ్లీ స్థానాలు, శ్రీకాకుళం లోక్‌సభ సీటు ఎందుకు కేటాయించారని ఈ రెండు సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓట్ల సంఖ్య ఆధారంగా కళింగ సామాజికవర్గానికి మూడు, తుర్పుకాపు సామాజికవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం కూటమి నేతలపై రెబల్స్‌ ట్రబుల్స్‌కు తోడు సామాజికవర్గం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -