Tuesday, May 7, 2024
- Advertisement -

కర్నూల్‌కు రామయ్య..అమలాపురంకు రాపాక

- Advertisement -

వైసీపీ అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటివరకు 10 జాబితాల్లో సిట్టింగ్‌ల మార్పు, మరికొన్ని చోట్ల ప్రకటించిన ఇంఛార్జీల స్థానంలో కొత్తవారిని చేర్చగా తాజాగా 11వ జాబితా రిలీజ్ అయింది.

రెండు , ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు జగన్. ఇక ప్రధానంగా కర్నూల్ ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ వీడింది. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్ గా మేయర్ బి.వై. రామయ్యను నియమించింది. వాల్మీకి సామాజిక వర్గానికే ఈసారి కర్నూల్ ఎంపీ స్థానాన్ని కేటాయించింది.

ఇక అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా రాపాక వరప్రసాద్‌ను నియమించగా, రాజోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం దక్కింది. మొత్తంగా ఇప్పటివరకు 11 జాబితాల్లో 73 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంట్ ఇంఛార్జీలను ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -