Tuesday, May 7, 2024
- Advertisement -

21న బాధ్యతల స్వీకరణ..షర్మిల ముందు సవాళ్లు!

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితురాలైన సంగతి తెలిసిందే. తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల…ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఇక నిన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరుగగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు షర్మిల. ఈ నెల 21న పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు షర్మిల. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరించడం వరకు ఓకే కానీ ఆమె ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన సవాల్. ఇక కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యలు చేపట్టిన కొన్ని రోజులకే ఎన్నికలు వస్తుండటంతో కనీసం సత్తా చాటేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం, పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించడంతో పాటు కేడర్‌కు భరోసా కల్పిండం షర్మిల ముందున్న సవాళ్లు ఇవే.

అలాగే సీనియర్లను అక్కున చేర్చుకోవడంతో పాటు ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ వైపు ఎలా మళ్లించాలి అన్నదానిపై షర్మిల దృష్టి సారించే అవకాశం ఉంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కనీస ఓటు బ్యాంకు కూడా సాధించలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఆల్‌మోస్ డెడ్ స్టేజ్‌లో ఉన్న కాంగ్రెస్‌కి పూర్వ వైభవం తేవాలంటే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల మద్దతు కూడ గట్టడం వారు ఎక్కడా అసంతృప్తికి లోనవ్వకుండా చూడటం వంటికి కత్తి మీద సామే. మొత్తంగా ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపై ఆ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -