Friday, May 3, 2024
- Advertisement -

రేవంతే సీఎం..అదే కొంపముంచుతుందా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. అధికార బీఆర్ఎస్ – ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక ప్రధానంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని నేతలంతా విస్తృత ప్రచారం చేయగా బీఆర్ఎస్ మాత్రం తాము హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇక పోలింగ్‌కు రెండు రోజుల ముందు కాంగ్రెస్ నేతలు రేవంతే సీఎం అని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రజల మూడ్ ఎలా ఉందో తెలియకుండానే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం అందరిని నవ్వు తెప్పిస్తోంది. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా హస్తం నేతల వ్యవహారం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇలానే చేసిన ఓవరాక్షన్‌ కారణంగా రేవంత్ కొడంగల్‌లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి కొడంగల్ ప్రజల నాడీ ఎలా ఉందో తెలియకుండానే రేవంత్‌ని సీఎం సీఎం అని ప్రచారం చేయడంలో అర్ధం లేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. వాస్తవానికి ఇంత ప్రచారం చేసి రేవంత్ కొడంగల్‌లో ఓడిపోతే అది ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందే. అందుకే మరికొంతమంది నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నికల ఫలితాల తర్వాతే ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -