నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

- Advertisement -

సివిల్ ఇంజినీర్‌గా కెరియ‌ర్ ప్రారంభించి.. ఆ త‌రువాత సినీ రంగ ప్ర‌వేశం చేసిన న‌టుడు న‌వీన్ పొలిశెట్టి. తెలుగులో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మై న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా న‌టించిన “చిచోరే” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్క‌డ మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీతో పాటు సినీ ప్రియుల నోళ్ల‌ల్లో ఎక్కువగా నానిన సినిమా “జాతిర‌త్నాలు”. ఇందులో న‌వీన్ పొలిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. చిన్న సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాలో న‌టించిన న‌వీన్ పొలిశెట్టితో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.

- Advertisement -

మ‌రీ ముఖ్యంగా ఈ చిత్రంలో అన్ని కోణాల్లోనూ సూప‌ర్ గా న‌టించిన న‌వీన్ పొలిశెట్టి.. ఇక ముందు క‌థ‌నాయ‌కుడిగానే కొన‌సాగాల‌నే నిర్ణ‌యానికి అనుగుణంగా ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ని సినీ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చార‌ట‌. ఇందులో ప‌లువురి క‌థ‌లుసైతం విన్నార‌ట‌. చూడాలి మ‌రి న‌వీన్ పొలిశెట్టి త‌ర్వాతి చిత్రం ఎవ‌రితో.. ఎలావుంటుందో.. !

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -