Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంత పెళ్లిలో ఐదు విషయాలు ఇవే

- Advertisement -

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో వైభవంగా జరిగింది. సినిమాల్లో వీరు లవర్స్ గా నటించారు. భార్య భర్తలు గా నటించారు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా భార్యభర్తలు అయ్యారు. సమంత సిద్దార్ద్ ను దూరం పెట్టాకా.. చైతుకి దగ్గర అయ్యింది. ఇక అప్పటి నుంచి వీరు ఒక్కరి మనసు ఒకరు తెలుసుకొని.. పెళ్లివరకు వచ్చారు. ఫిబ్రవరిలో వీరి వివాహ నిశ్చితార్థం అయ్యింది.

పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి సమంత, నాగచైతన్య పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి లో ఐదు ప్రత్యేక విషయాలను మనం గమనించవచ్చు.

* మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. తర్వాత క్రిస్టియన్‌ మతాచారం ప్రకారం జరిగింది.

* తెలుగు వారి మంగళ సూత్రంకు, తమిళుల మంగళ సూత్రంకు తేడా ఉంటుంది. సమంత మెడలో నాగచైతన్య తెలుగు వారి మంగళ సూత్రంను కట్టడం జరిగింది. అంటే తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.

* పెళ్లి సమయంలో నాగార్జునతో పాటు అమల, అఖిల్‌లు కూడా చాలా హడావుడి చేశారు. కాని నాగచైతన్య తల్లి మాత్రం కనిపించలేదు. అయితే నాగచైతన్య మేనమామలు సురేష్‌బాబు, వెంకటేష్‌లు పెళ్లిలో చాలా హంగామా సృష్టించారు. సురేష్‌బాబు ఏకంగా డాన్స్‌లు కూడా వేయడం జరిగింది.

* పెళ్లిలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ వారు మినహా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఏ ఒక్కరు కూడా కనిపించలేదు. పెళ్లికి కొంత మంది సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లుగా జరిగిన ప్రచారం నిజం కాదని తేలిపోయింది. వెన్నెల కిషోర్‌, చిన్మయి ఇలా అతి కొద్ది మంది సాదారణ సెలబ్రెటీలు హాజరు అయ్యారు.

* పెళ్లి టైంలో సమంత, నాగచైతన్యల మొహాల్లో ఆనందం చూస్తుంటే వారు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నది సాధించినట్లుగా కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -