సుశాంత్ వీడియాలు చూసి ఎమోషన్ అయ్యాను.. : శ్రీరెడ్డి పోస్ట్

- Advertisement -

సుశాంత్ సింగ్ మృతి ఎంతో మందిని బాధించింది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంసై సినీలోకంతో పాటు, యావత్ సమాజం నివ్వెరబోయింది. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, మాఫియానే కారణమని నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

కరణ్ జోహర్, ఆయన మాఫియా గురించి, బంధుప్రతీ, సల్మాన్ ఖాన్ ఇలా రోజుకో సెలెబ్రిటీ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సుశాంత్ మృతిని సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా సుశాంత్ మరణంపైనా శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. “నీ మరణానికి కారకులను నేను అభినందిస్తున్నాను.. వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో… కానీ మిస్టర్ సుశాంత్ సింగ్ ఇండియా నిన్ను మిస్ అవుతుంది..ఆత్మకు శాంతి చేకూరాల’ని పోస్ట్ చేసింది.

- Advertisement -

అంతేకాకుండా..”సుశాంత్ మరణానికి సంబంధించిన వీడియోలు చూసి తెలియకుండానే నన్ను డిప్రెషన్‌కు గురయ్యాను. వ్యక్తిగతంగా నేను కూడా ఈ లాక్ డౌన్‌లో ఎన్నో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చవిచూశాను. పైగా చెన్నై పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎంతోమంది అమాయకులు, కల్నల్ సంతోష్ బాబు వంటి వారు చనిపోతున్నారు.. మీతో టచ్‌లో ఉండటానికి నా టీమ్ పాత వీడియోలను పోస్ట్ చేసింది. నేను మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను’ అని పేర్కొంది.

హీరోయిన్ గా యాంకర్ సుమ ఎలా ఉందో చూడండి

సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా : ఖుష్బూ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు : మంచు లక్ష్మి

శృంగారంలో స్వయంతృప్తి పొందే గృహిణిగా ఈషా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -