Thursday, May 9, 2024
- Advertisement -

మన సింగర్స్ పరిస్థితి మ‌రీ ఇంత నీచ‌మా??

- Advertisement -
tollywood singers

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల‌కు మంచి రెమ్యునరేషన్లు ఉంటాయి. ఇక ద‌ర్శ‌కుల సంగ‌తైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమాకి ప‌ది కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే వారు ఉన్నారు. అయితే చిత్ర‌సీమ‌లో అంద‌రి ప‌రిస్థితీ ఇంతే అని కరెక్ట్ గా చెప్పలేం. కొంత‌మంది ద‌గ్గ‌రైతే గీచి గీచి బేరాలు ఆడేవాళ్లున్నారు. మ‌రీ ముఖ్యంగా గాయ‌నీ గాయ‌కుల‌కు అతి త‌క్కువ స్థాయిలో పారితోషికాలు అందుతున్న‌ట్టు స‌మాచారం.  

స్టార్ సింగర్స్ సంగతి పక్కన పెడితే.. కొత్త‌గా ఈ రంగంలోకి అడుగుపెట్టిన ప్ర‌తిభావంతుల‌కు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అన్యాయ‌మే జ‌రుగుతోంద‌ని సమాచారం. బోల్డంత ప్ర‌తిభ ఉండి, చేతిలో హిట్ గీతాలున్న ప్ర‌ణ‌వి లాంటి సింగ‌ర్స్‌కి ఒక్కో పాట‌కు ఐదు వేల‌కు మించి ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇదే సంగతిని ప్ర‌ణ‌వి కూడా చెప్పింది. త‌న‌కే కాదు…. త‌న స్థాయి ఉన్న గాయ‌నీమ‌ణుల‌కు చాలా త‌క్కువ రెమ్యునరేషన్ లు అందుతున్నాయ‌ని తెలిపింది. కొంత‌మంది రెండు వేల‌కు, మూడు వేల‌కు పాట పాడ‌మ‌ని బేరాలు ఆడుతున్నార్ట‌.

కేవ‌లం తెర‌పై పేరు చూసుకోవాల‌న్న త‌ప‌న ఉన్న గాయ‌కులు పాట‌ల్ని ఉచితంగా పాడ‌డానికి ముందుకొస్తున్నార‌ని, దాంతో త‌న‌లాంటి సింగ‌ర్స్‌కి స‌రైన పారితోషికాలు అంద‌డం లేద‌ని వాపోతోంది ప్ర‌ణ‌వి. సంగీత ద‌ర్శ‌కులు సినిమా మొత్తాన్ని ఓ ప్యాకేజీలా తీసుకొంటున్నారు. వాళ్లే గాయ‌నీ గాయ‌కుల‌కు, గీత ర‌చ‌యిత‌ల‌కు పారితోషికాలు ఇస్తున్నారు. ఒక‌రిద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు మిన‌హా.. మిగిలిన వాళ్లెవ్వ‌రూ గాయ‌నీ గాయ‌కుల‌కు స‌రైన పారితోషికాలు ఇవ్వ‌డం లేద‌ని, ప‌రిశ్ర‌మ‌లో అస‌లు సింగ‌ర్స్ అంటే లెక్కేలేద‌ని, బ‌య‌ట వేదిక‌ల‌పై పాడ‌డ‌మే బెట‌ర్ అని కొంత‌మంది గాయ‌కులు వాపోతున్నారు.

Related

  1. సింగర్ సుచిత్ర ఎక్కడ..? పవన్ అలా చేస్తాడా..?
  2. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు
  3. సింగర్ సునీత పై మరో రూమర్
  4. “రాగం” సింగర్ సునిత నిజజీవితమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -