Friday, April 26, 2024
- Advertisement -

అక్కడ పదిరోజుల లాక్ డౌన్

- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ అంతకంతకు వికృతరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన ఒక్కరోజులో తెలంగాణలో కొత్తగా 10,122 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఉదయం మీడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో కరొనా నుంచి కొత్తగా 6446 మంది కోలుకున్నారని, కొత్తగా 52 మంది చనిపోయారని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే తెలంగాణ లో కరోనా తీవ్రత ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు.

తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కరోనా మహమ్మారి పెరగడంతో పలు గ్రామాలు పది రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించాలని నిర్వహించుకుంటున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో గ్రామపంచాయతీలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పెద్దమందడి మండలంలోని మనందరి తాండా గ్రామ పంచాయతీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని గ్రామ సర్పంచ్ జయంతి లాక్ డౌన్ ప్రకటించారు.

గ్రామంలో దాదాపు 20 కరోనా కేసులు నమోదు కావడంతో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను రద్దు చేయాలని, బెల్టుషాపులు, కిరాణా షాపులు, హోటల్ అన్ని వాణిజ్య కార్యకలాపాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ. 500 జరిమానా విధిస్తామని ప్రకటించారు.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

కరోనాతో నటి మాలాశ్రీ భర్త కన్నుమూత

చేతి నరాలు కట్ చేసుకొని మాలీవుడ్ నటుడు ఆత్మహత్యాయత్నం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -