Thursday, April 25, 2024
- Advertisement -

ఇజ్రాయిల్ పవిత్ర స్థలం వద్ద ఘోరం.. తొక్కిసలాటలో 44 మంది మృతి!

- Advertisement -

ఇజ్రాయిల్ లోని మౌంట్ మెరిన్ పవిత్ర స్థలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి జరిగిన తొక్కసలాటలో 44 మందికిపైగా మృతిచెందారు. మరో 60మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. లాగ్ బౌమర్ పండుగ సందర్బంగా వేలాది మంది యూదులు మెరిన్ కు ప్రార్థనల కోసం తరలి వచ్చారు. ఈ సమయంలో అక్కడ పాట కచేరి నిర్వహించారు.

అందరు ఉత్సాహంగా గెంతులేస్తున్న సమయంలోనే షెడ్ పై కప్పు కూలిపోయింది. దాంతో అందరిలో భయం నెలకొడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 44 మంది మృతి చెందినట్లు హిబ్రూ మీడియా తెలిపింది. 38 మంది మృతి చెందినట్లుగా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉండాలని తెలిపారు వైద్యులు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దుర్ఘటనను ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు.

మంచు విష్ణు కుటుంబంలో చిచ్చు.. ఐపీఎల్ వల్లే అంటూ ట్వీట్!

స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కన్నుమూత!

కూకట్ పల్లిలో కాల్పుల నిందితుల అరెస్ట్.. ఆ తప్పుతోనే బుక్కయ్యారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -