Tuesday, May 7, 2024
- Advertisement -

ఆంధ్రుల వ‌ర‌ప్ర‌దాయినికి అర‌వై యేళ్లు

- Advertisement -

కృష్ణా ప‌రివాహాక ప్రాంతంలో 13 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టును స‌స్య‌శ్యామలం చేస్తున్న ప్రాజెక్టు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అన్న‌పూర్ణ‌గా తీర్చిదిద్దుతున్న ప్రాజెక్టు ప్ర‌కాశం బ్యారేజ్. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ చెంత‌న ఉన్న ప్ర‌కాశం బ్యారేజ్ డిసెంబ‌ర్ 24, 2017తో 60 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఆంధ్రుల వ‌ర‌ప్ర‌దాయినిగా 1957 డిసెంబ‌ర్ 24వ తేదీన ఈ ప్రాజెక్టు మారింది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి నీలం సంజీవ‌రెడ్డి దీనిని ప్రారంభించారు.

కృష్ణా న‌ది వ‌ర‌ద ప్ర‌వాహాన్ని చూసిన స‌ర్ ఆర్ధార్ కాట‌న్ 1847లో ఇక్క‌డ ఓ ఆన‌క‌ట్ట నిర్మించాల‌ని చెప్పాడు. అప్ప‌టి బ్రిటీష్ కాలంలో ఓర్ అనే ఇంజినీర్ ఆధ్వ‌ర్యంలో ఆన‌క‌ట్టు నిర్మించారు. అయితే కొన్నేళ్ల‌కు వ‌ర‌ద ప్రవాహంతో ఆ ఆన‌క‌ట్ట తెగిపోయింది. ఆ ఆన‌క‌ట్ట స్థానంలో బ్యారేజీ క‌ట్టారు. రూ.2 కోట్లతో చేప‌ట్టిన ప‌నులు 1957కు పూర్త‌య్యాయి. అప్ప‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌ల్ప‌వ‌ల్లిగా మారింది. 11 ల‌క్ష‌ల 10 వేల క్యూసెక్కుల నీటిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం ఈ ప్రాజెక్టు సొంతం. మొద‌ట కృష్ణా బ్యారేజీగా ఉన్న దీన్ని ప్ర‌కాశం బ్యారేజ్‌గా మార్చారు.

ఈ బ్యారేజ్‌తో కృష్ణా, ప్ర‌కాశం, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల రైతుల‌కు పాడిపంట‌లు పండేలా చేస్తోంది.
ఏలూరు కాలువ‌, బంద‌రు కాలువ‌, రైవ‌ర్స్ చానెళ్ల ద్వారా ఆయ‌క‌ట్టు రైతుల‌కు నీరు పారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -