Friday, April 19, 2024
- Advertisement -

గ్రీన్ జోన్ లో బాంబు మోతలు..8 మంది మృతి..!

- Advertisement -

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్‌ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 20కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు, వ్యాపార సమూహాలు, అంతర్జాతీయ కంపెనీలు ఉన్న గ్రీన్‌జోన్‌కు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడం వల్ల అఫ్గాన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాకెట్ల దాడిలో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. ఖతార్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, తాలిబన్‌ మధ్య నేడు చర్చలు జరగనున్న కొద్ది గంటల ముందే కాబూల్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. కాగా.. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌ ప్రకటించింది.

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

ఆ రాష్ట్రాలలో మళ్ళీ కర్ఫ్యూ..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -