Tuesday, April 16, 2024
- Advertisement -

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

- Advertisement -

ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. విన్నా కరోనా వైరస్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటడం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 370 కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇక్కడి లాహౌల్-స్పితి వ్యాలీ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. 

తాజాగా తొరాంగ్ అనే కుగ్రామంలో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇది ఒక చిన్న గ్రామం.. ఇక్కడ జనాభా 42 మంది కాగా,  52 ఏళ్ల భూషణ్ ఠాకూర్ అనే వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. మిగతా అందరూ కరోనా బారినపడ్డారు.  అయితే ఇక్కడ రవాణా వ్యవస్థ వెంటనే ఆపివేశారు.

అంతే కాదు కరోనా ప్రబలడంతో టూరిస్టులకు ఈ ప్రాంతంలో ప్రవేశాలు నిలిపివేశారు. విచిత్రం ఏంటేంటే.. నెగెటివ్ వచ్చిన భూషణ్ ఠాకూర్ కుటుంబంలోని ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. కొన్నిరోజుల కిందట జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఒక్కచోట గుమికూడడంతో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు.

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

కృతి శెట్టి చూపు రామ్ చరణ్ వైపు..!

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -