Monday, April 29, 2024
- Advertisement -

ఇప్పుడు ఎవ‌రు పైపులు కోశారో ….?

- Advertisement -

అమ‌రావ‌తిని ప్ర‌పంచం మెచ్చే రాజ‌ధానిని నిర్మిస్తాన‌ని చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌ను ఊహ‌ల్లోతేలిపోయె విధంగా సినిమా చూపించారు. ప్ర‌భుత్వ ప‌రిపాల‌నా ఏపీనుంచె కొన‌సాగించాలని హ‌డావుడిగా అమ‌రావ‌తిలో అసెబ్లీ,స‌చివాల‌యాన్ని నిర్మించారు.ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇంత త‌క్కువ సమ‌యంలో రెండిటిని నిర్మించామ‌ని చెప్పుకున్న గొప్ప‌లు ఇప్పుడు చిన్న‌బోయాయి.
తాజాగా కురుస్తున్న‌వ‌ర్షానికి ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్‌ అవుతోంది. 4వ బ్లాక్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మంత్రి గంటా యాంటీ రూమ్, దేవినేని ఉమ ఛాంబర్ తో పాటు పలుచోట్ల వర్షపు నీరు లోపలికి వచ్చింది. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్‌ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్‌ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది.సాక్ష్యాత్తు మంత్రుల చాంబ‌ర్‌ల‌లోనె నీటి లీకేజులు అవ్వ‌డం ఇప్పుడు ప్రాధాన్య‌త సంత‌రించ‌కుంది.
గత నెలలో కురిసిన వర్షానికి కూడా సచివాలయంలో వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాంబర్‌లోకి వర్షపు నీరు వచ్చింది.దీనిపై వైసీపీ ప్ర‌భుత్వం మీద చేసిన విమ‌ర్శ‌ల‌పై అధికార పార్టీ నానాయాగి చేసింది.ఎవ‌రో కావాల‌నే నీటి పైపుల‌ను కోయ‌డంతోనె వ‌ర్షం లీకేజి అవుతోంద‌ని క‌ప్పి పుచ్చుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఏకంగా సీఐడీ నియ‌మించి మ‌రీ ఎంక్వ‌యిరీ చేయించారు.
గ‌తంలో ప్ర‌తి ప‌క్ష‌నేత‌లే ప్ర‌భుత్వాన్ని బ‌ద‌నాం చేసేందుకు కుట్ర‌లు ప‌న్ని పైపులు కోశార‌ని ర‌చ్చ‌ర‌చ్చ‌చేసింది.త‌మ వైఫ‌ల్యాల‌ను కప్పు పుచ్చుకొనేందుకు మంత్రులంద‌రూకూడా ప్ర‌తిప‌క్షాల‌పై ఎదురు దాడి చేశారు.మ‌రి ఇప్పుడు ఏకంగా స‌చివాల‌య జ‌ల‌పాతాల్ను త‌ల‌పిస్తోంది.ఇప్పుడు ఏపార్టీ వారు పైపులు కోశారో స్పీక‌ర్ చెప్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -