Saturday, May 25, 2024
- Advertisement -

బ్రాడ్ బ్యాండ్ క‌ష్ట‌మ‌ర్ల‌కు కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్‌

- Advertisement -
Airtel to new offer for home broadband users 100% more data

టెలికం రంగంలో పోటీ త‌త్వం పెర‌గిపోవ‌డంతో అన్ని టెలికం సంస్థ‌లు త‌మ క‌ష్ట‌మ‌ర్ల‌ను కాపాడుకొనేందుకు నానాపాట్లు ప‌డుతున్నారు.వేరే నెట్ వ‌ర్క్‌ల‌కు వెల్ల‌కుండా కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.ఇప్పుడ ఏయిర్‌టెల్ త‌మ క‌ష్ట‌మ‌ర్ల‌కోసంమ‌రో బంఫ‌ర్ ప్ర‌క‌టించిది.

టెలికం మార్కెట్ లో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లు, ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోనూ సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. జియో ఫైబర్ సర్వీసులు ప్రారంభించడానికి ముందే, భారతీ ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండు సర్వీసుల్లో హై-స్పీడు డేటా ప్రయోజనాలను 100శాతం రెట్టింపు చేయడం ప్రారంభించింది. తన కస్టమర్లు జియోకు మరలకుండా కాపాడుకోవడానికి ప్లాన్స్ లో డేటా ప్రయోజనాలను రెట్టింపు చేస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కొత్త ఆఫ‌ర్ ప్ర‌కారం 899 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్న 30జీబీ హైస్పీడ్ డేటాను, 60జీబీకి పెంచింది. అదేవిధంగా రూ.1099 ప్లాన్ కింద ఆఫర్ చేసే 50జీబీ డేటాను ప్రస్తుతం 90జీబీకి పెంచుతున్నట్టు ప్రకటించింది. 1299 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 75జీబీ డేటాను 125జీబీకి, 1499 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 100జీబీ డేటాను 160జీబీకి పెంచుతున్నట్టు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

{loadmodule mod_custom,Side Ad 2}

ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సిటీలోనూ ఈ డేటా ప్రయోజనాల ఇంక్రిమెంట్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. అన్ని ప్లాన్స్ కింద ఏ నెట్ వర్క్ కైనా, అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. కొత్త కస్టమర్లు డేటా ప్రయోజనాలు బట్టి డేటా ప్లాన్స్ ను ఎంపికచేసుకోవచ్చని చెప్పింది. ఫ్యూచర్ రెడీ నెట్ వర్క్ ను ఎయిర్ టెల్ రూపొందించిందని, ఇందులో భాగంగానే వీ-ఫైబర్ ను లాంచ్ చేసిందని తెలిపింది. వీఫైబర్ తో హోమ్స్ కు 100 ఎంబీపీఎస్ స్పీడు వరకు సూపర్ ఫాస్ట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందిస్తున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. పేర్కొంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 30 ట‌న్నుల పొక్లెయిన్‌ను అమాంతం ఎత్తిన రియ‌ల్ బాహుబ‌ళి…..
  2. 23 నుంచి బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్న పేటీఎమ్
  3. సంవ‌త్స‌రం పాటు ఉచిత ఇంట‌ర్నెట్ స‌దుపాయంతో మైక్రోమ్యాక్స్ కొత్త పోన్‌ను …
  4. భార‌త్ మార్కెట్‌లోకి త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్న మోట‌రోలా..

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -