Friday, May 3, 2024
- Advertisement -

మంత్రి గంటాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన‌ అన‌కాప‌ల్లి కోర్టు

- Advertisement -

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి భారీ షాక్ తగిలింది. ఆయనకు బుధవారం నాడు నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్టు జడ్జి ఆయనకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.

వివ‌రాల్లోకి వెల్తే 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అక్రమ మార్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గంటా శ్రీనివాసరావు పెద్ద ఎత్తున క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప‌లు మార్లు కోర్టుకు హాజ‌రు కావాల‌ని జారీచేసిన ఆదేశాల‌ను లెక్క చేయ‌క పోవ‌డంతో చివ‌రికి గంటాను అరెస్ట్ చేయాల‌ని తాజాగాఆదేశాలు జారీ చేసింది అన‌కాప‌ల్లి కోర్టు.

గంట‌కు నాన్ బేయిలబుల్ వారెంట్‌ను జారీ చేయ‌డం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. కేసు తుది విచార‌ణ‌లో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేయ‌డంతో మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -