Thursday, May 2, 2024
- Advertisement -

25 మంది మంత్రుల‌తో జగన్ కేబినెట్.. మంత్రి పదవులు దక్కింది వీరికే

- Advertisement -

న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో కొత్త కేబినేట్ కొల‌వు తీర‌నుంది. 25 మందితో రేపు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకొని జ‌గ‌న్ కేబినేట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కేబినేట్‌లో ఐదుగురిని డిప్యూటి సీఎంలుగా తీసుకుంటున్నారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.ఇక స్పీకర్‌గా తమ్మినేని సీతారాం.. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతికి అవ‌కాశం క‌ల్పించారు జ‌గ‌న్.

జిల్లావారీగా మంత్రుల లిస్ట్ చూసుకుంటె..

బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి, విజయనగరం )
అవంతి శ్రీనివాస్ (భీమిలి, విశాఖపట్నం )
ధర్మాన కృష్ణదాస్(నరసన్నపేట)
కొడాలి నాని (గుడివాడ, కృష్ణా )
పేర్ని నాని(మచిలీపట్నం, కృష్ణా )
ఆళ్ల నాని (ఏలూరు, పశ్చిమ గోదావరి )
తానేటి వనిత (కొవ్వూరు, పశ్చిమ గోదావరి)
పుష్ప శ్రీవాణి (కురుపాం, విజయనగరం)
మేకతోటి సుచరిత ( పత్తిపాడు, గుంటూరు )
కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్, తూర్పు గోదావరి)
పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ, తూర్పు గోదావరి)
పినిపె విశ్వరూప్(అమలాపురం, తూర్పుగోదావరి)
చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట, పశ్చిమగోదావరి)
బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు, ప్రకాశం)
వెల్లంపల్లి శ్రీనివాస్ ( విజ‌య‌వాడ ప‌శ్చిమ‌,కృష్ణా )
మోపిదేవి వెంకటరమణ (రేపల్లె, గుంటూరు )
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(డోన్, కర్నూలు)
గుమ్మన జయరాం (ఆలూర్, కర్నూలు )
నారాయణస్వామి (గంగాధర నెల్లూరు, చిత్తూరు)
అంజద్ బాషా (కడప, కడప)
శంకర్ నారాయణ ( పెనుగొండ, అనంతపురం)
అనిల్ కుమార్ యాదవ్(నెల్లూరు సిటీ, నెల్లూరు)
ఆదిమూల‌పు సురేష్‌
మేకపాటి గౌతమ్ రెడ్డి(ఆత్మకూరు, నెల్లూరు)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు, చిత్తూరు)

స్పీకర్‌- తమ్మినేని సీతారం (కళింగ-బీసీ)
డిప్యూటీ స్పీకర్- కోన రఘుపతి (బ్రాహ్మణ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -