Friday, April 26, 2024
- Advertisement -

గోదావరి జిల్లాలు మినహా.. ఏపీలో కర్ఫ్యూ సడలింపులు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కరోనా కు సంబంధించిన కర్ఫ్యూను దాదాపు పూర్తిస్థాయిలో సడలించింది. ఒక్క గోదావరి జిల్లాలు (తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి) మినహా మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఎత్తేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని దుకాణాలు తెరుచుకొనేందుకు అనుమతి ఇచ్చారు.ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కరోనా అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడ ఆంక్షలను కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి.

కాగా చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి గోదావరి జిల్లాలతో పాటు పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మరణాలు ఆ జిల్లాలోనే ఎక్కువ. అయితే తాజా సడలింపుల్లో చిత్తూరులో కూడా రాత్రి 10గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఏపీలో కొత్తగా 3,166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231కి చేరింది.

Also Read

ఏపీలో బడులు స్టార్ట్ .. ఎప్పటినుంచంటే?

ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కేంద్రమంత్రి పదవి..లక్​అంటే ఈయనదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -