Thursday, May 9, 2024
- Advertisement -

చట్టాన్ని ఉల్లంఘిస్తూ కోడిపందేలు నిర్వహించిన టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల లిస్ట్ ఇదిగో

- Advertisement -

ప్రత్యేక హోదా ఉద్యమంతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విపక్షాల నాయకులు, ఉద్యమకారులు ఎవరైనా సరే నిరసనలు తెలుపుతామన్నా, ఉద్యమం చేస్తామన్నా సరే……. నారా చంద్రబాబు నాయుడు అంతెత్తున లేస్తారు. తన పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కఠినంగా శిక్షిస్తానని రంకెలు వేస్తారు. ఇక పచ్చ బ్యాచ్ అంతా కూడా చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడిన మాటలను ప్రజాస్వామ్య పరిరక్షణగా, ప్రజలకు మేలు చేస్తున్న చర్యలుగా ప్రచారం చేయడానికి రెడీ అయిపోతారు. మరి అంతటి ఘనాపాఠికి ఇప్పుడు టిడిపి నేతలే సవాల్ విసిరారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులందరూ కూడా కోడిపందేల్లో పాల్గొన్నారు, నిర్వహించారు, బహుమతులు కూడా అందించారు. ఇంకా సగర్వంగా పచ్చ మీడియాలో ప్రచారం కూడా చేయించుకున్నారు. కోడిపందేలను ప్రోత్సహించాం కాబట్టి…….. కోడిపందేల రాయుళ్ళ ఓట్లన్నీ మాకే పడాలన్న ప్రచార కాంక్ష అన్నమాట. ఈ వ్యవహారాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవే. చట్టాన్ని ఉల్లంఘించిన చర్యలే. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే……ఆ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు.

మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీలు వైబి రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, బోడె ప్రసాద్, దాట్ల బుచ్చిబాబు, అనగాని సత్యప్రసాద్‌లు ప్రముఖంగా మీడియాలో కనిపించారు. కోడిపందేలను ఎంకరేజ్ చేస్తూ కోడిపందేలను ప్రారంభించారు, ఫ్లెక్సీల్లో కనిపించారు. కోడిపందేల్లో పాల్గొన్నారు, బహుమతుల ప్రధానోత్సవం కూడా చేశారు. ఇక మీడియా కంట కనపడకుండా పందేలు నిర్వహించిన వాళ్ళ లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉంది. మరి నారా చంద్రబాబునాయుడుగారి ప్రజాస్వామ్య పరిరక్షక పాలనలో చట్టాన్ని ఉల్లంఘించిన ఈ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు? ప్రత్యేక హోదా ఉద్యమం అన్నా, రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో నిరసనలు అన్నా, రైల్వేజోన్ కోసం ఉద్యమం అన్నా సరే….చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు……వదిలేది లేదు అని కన్నెర్ర చేస్తూ తన వందిమాగదుల్లా ఉండే పోలీసుల చేత కేసులు బనాయిస్తూ, 144 సెక్షన్ విధిస్తూ అత్యంత పాశవికంగా చర్యలు తీసుకునే చంద్రబాబుకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఈ టిడిపి ప్రజాప్రతినిధులు కనిపంచడం లేదా? పచ్చ మీడియాలో కూడా …..మా టిడిపి నాయకులు కోళ్ళ పందేలు భలే ఆడుతున్నారహో అనే స్థాయిలో భజన వార్తలు మాత్రమే వస్తుండడం గమనార్హం. లిక్కర్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగిందన్న ఆనందంలో ఉన్నాడో……..లేక టిడిపి నేతలు ఏం చేస్తే అదే చట్టం……అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడో కానీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా కోట్లాది రూపాయలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు కోళ్ళ పందేలు ఆడుతుండడం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలను ఎలా సాగుతుందో చెప్పకనే చెప్తోంది అన్నది నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -