Monday, April 29, 2024
- Advertisement -

వైద్య‌, ఆరోగ్య శాఖ‌పై కీల‌క ఆదేశాలు ఇచ్చిన జ‌గ‌న్‌….

- Advertisement -

సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నె జ‌గ‌న్ అన్ని శాఖ‌ల‌పై అధికారుల‌తో రివ్యూల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. అన్ని శాఖ‌ల్లో పేరుకుపోయిన అవినీతిని తొల‌గించేందుకు జ‌గ‌న్ క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు.తాజాగా వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో శాఖ‌పై స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. శాఖ ప‌నితీరుపూ జ‌గ‌న్ త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని, శాఖ పనితీరు మెరుగుపరచాలంటే సమూల ప్రక్షాళన తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప‌లుక ఆదేశాలు అధికారుల‌కు ఇచ్చారు. మ‌రో వైపు ఈ శాఖ‌ను తానె ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిస్తాన‌ని తెలిపారు.

స‌మీక్షా స‌మావేశంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదవారికి నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వివరించారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం అందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిని సహించబోమని స్పష్టం చేసిన నవ్యాంధ్ర సీఎం… అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు.

వైద్యరంగం ప్రక్షాళనకు నిపుణుల కమిటీ నియమించాలని ఆదేశించిన వైఎస్ జగన్… 45 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని అధికారులకు కోరారు.ఎన్టీఆర్ వైద్య సేవను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా 104, 108 వాహ‌నాల ప‌నితీరును స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.వైఎస్ఆర్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని నిర్వహించాలని సూచించారు.

లుకలు కొరికి పిల్లలు చనిపోవడం, మొబైల్ ఫోన్లతో వైద్యం చేయడం వంటి ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్… ఎన్నడూ లేని సంఘటనలు గత ఐదేళ్లలో చూశాం.. ఇలాంటి ఘటనలు జరగకుండా వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు పెంచలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. నకిలీ ఔషధాలపై కఠినంగా వ్యవహరించాలి.. వైద్య పరికరాల, మందులు, మౌలిక వసతుల టెండర్లపై పునర్‌సమీక్ష చేయాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -