Monday, April 29, 2024
- Advertisement -

సొంత పార్టీ నాయకుడిని చంపిన టీడీపీ నేతలు

- Advertisement -

ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన దాడి పై టీడీపీ అండ్ కో విష ప్రచారం ప్రారంభించింది. వాస్తవాలను దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. సొంత పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నేతలే తమ పార్టీకి చెందిన నేతను హత్య చేస్తే వైసీపీ పైన ఆరోపణలు చేస్తోంది. వ్యక్తిగత గొడవలు, పార్టీలో ఆదిపత్య ఘర్షణలే ఈ హత్యకు కారణం. హంతకులు, హతుడు ఇద్దరూ టీడీపీ వారే. వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్నికల్లో వెనుకబడిన టీడీపీ ఈ ప్రచారంతో అసలు విషయాన్ని పక్క దోవ పట్టిస్తోంది.

పరమేశ్వర నగర్ కు చెందిన పాముల మునెయ్య తన సమీప బంధువు అయినా గుండాల అల్లూరయ్యకు వ్యక్ిగత విభేదాలున్నాయి. పలు సందర్భాల్లో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ క్రమంలో పాముల మునెయ్య స్నేహితుడైన ఓబులాపురం తండా నివాసి రామాంజనేయులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జాయామిల్ కర్ర కొట్టుకొచ్చాడు. దీని పైన ఈ నెల 14వ తేదీన అటవీ శాఖా అధికారులకు సమాచారం అండటంతో జామాయిల్ తోటను పరిశీలించి నిందితుడైన రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. అతడికి జరిమానా విధించారు. అయితే, అల్లూరయ్య ఇచ్చిన సమాచారంతోనే రామాంజనేయులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారని ఆగ్రహించిన మునెయ్య దుర్భాషలాడాడు.

టీడీపీలో మెనెయ్యకు ప్రాధాన్యత ఇస్తండటంతో అల్లూరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా అంటీ ముట్టనట్లు వ్యవహరించేవాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లూరయ్య తన మనషులతో కలిసి మునెయ్య పైన గొడ్డలిలో డాడికి పాల్పడ్డాడు. తల పై తీవ్ర గాయమైన మునెయ్యను బంధువలు హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ, పచ్చ మీడియా దీనిని రాజకీయ హత్యగా.. వైసీపీ చేసిన హత్యగా దుష్ఫ్రచారం చేస్తోంది. ఈ రకమైన ప్రచారమే ప్రజల్లో మరింతగా టీడీపీ పైన ఏహ్య భావం పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -