Friday, March 29, 2024
- Advertisement -

బాంబు పేల్చిన మంత్రి… రాజ‌కీయ‌పార్టీల్లో గుబులు…

- Advertisement -
Arun Jaitley next Target cleaning up political funding govt’s top priority

దేశంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత మోడీ సర్కారు మరో కీలక అంశం మీద దృష్టిపెట్టింది.దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కుదిపేసే నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

మొత్తం దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ ప్రభావితంచేసే నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడం తమకు ఇప్పుడు అత్యధిక ప్రాధాన్య అంశమ ని చెప్పి.. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మరో బాంబు పేల్చారు.

{loadmodule mod_custom,GA1}

70 ఏళ్ల క్రితం ఉన్న ఈ విరాళాల వ్యవస్థ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి ఎలాంటి పేరు రావట్లేదని, అందువల్ల ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీ చెబుతున్నారని, దీనికి ప్రజామద్దతు కూడా బలంగా ఉందని జైట్లీ చెప్పారు.
రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు కాకుండా ఎలక్టొరల్‌ బాండ్ల రూపంలో ఇవ్వాలని బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్ప‌టికే దీనిపై ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న మొద‌లు పెట్టింది.దీని వ‌ల‌న ప్ర‌తికూల ప్ర‌భావాలు ఎద‌ర‌వుతాయ‌ని ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నసీమ్‌ జైదీ తెలిపారు.దీనిపైన ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌త్యామ్నాయాలు చూస్తాదో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}4RwISQOHF0Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -