Sunday, April 28, 2024
- Advertisement -

బడ్జెట్ తర్వాత ఏవి పెరిగాయి.. ఏవి తగ్గాయి

- Advertisement -
Arun Jaitley Budget 2017 Highlights

కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ఈ సంవత్సరంపు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సర బడ్జెట్ ప్రకారం వేటి ధరలు పెరిగాయో, వేటి ధరలు తగ్గాయో తెలుసుకుందాం.

పొగరాయుళ్లు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారు వాటికి మరింత దూరం జరిగేలా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మళ్లీ తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. 2017-18 బడ్జెట్‌లో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచారు. దీంతో పొగాకు ఉత్పత్తులు మరింత ప్రియంకానున్నాయి. రేట్లు పెరిగే వస్తువులు ఏటంటే… సిగరెట్, పాన్ మసాలా, చుట్టలు, బీడీలు, నమిలే పొగాకు, ఎల్‌ఈడీ సంబంధిత లైట్లు, జీడిపప్పు, అల్యూమినియం ఉత్పత్తులు,  వెండి నాణేలు, పతకాలు,  మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల ధరలు భారీగా పెరగున్నాయి. కాగా రేట్లు తగ్గే వస్తువులేంటంటే..  ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్,  ద్రవీకృత సహజ వాయువులు,  ఇళ్లలో ఉపయోగించే ఆర్‌వో ప్లాంట్ల భాగాలు, సోలార్ టెంపర్డ్ గ్లాసులు,  ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి పరికరాలు,  పవన విద్యుత్ జనరేటర్లు, చర్మశుద్ధి పదార్థాలు, ఫింగర్ ప్రింట్ రీడర్ల ధరలు తగ్గునున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -