Friday, May 3, 2024
- Advertisement -

చికెన్‌, ఫోర్క్ కంటే అక్క‌డ ఎలుక మాంసానికి భారీ డిమాండ్‌ ..

- Advertisement -
       

కోడి, పంది, మేక‌, పొట్టేలు మాంసం తిన‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డ‌తారు. ఇది ఎక్క‌డైనా స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఎలుక మాంసం కోసం ఎగబడటం ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎలుక మాంసం తింటారన్న విషయం తెలుసా..? అస్సాంలో మాత్రం ఎలుక మాంసంకోసం జ‌నాలు ఎగ‌డుతున్నారు. కిలో రూ.200 పెట్టి కొంటున్నా దొర‌క‌డంలేదు. దీంతో అక్క‌డ ఎలుక‌ల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. దీని వ‌ల్ల రైతులు లాభాలు గ‌డిస్తున్నారు. పండించిన పంట కంటే ఎలుక‌లు అమ్మ‌డం ద్వారానే ఎక్కుల లాభాలు పొందుతున్నారు.

ఇక అసలు విష‌యానికి వ‌స్తే…. అస్సాంలోని కుమరికటా గ్రామ రైతులు, కూలీలు సరికొత్త వ్యాపారం మొదలుపెట్టారు. సాధారణంగా పంట పొలాల్లోకి ఎలుకలు వెళ్లి పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన ఎలుకలను పంట నాశనం చేయకుండా.. ర‌క్షించుకొనే క్ర‌మంలో వెంటాడిన ఎలుకలను అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు అక్కడి మార్కెట్‌ ఎలుక మాంసం కొనేవారితో కిటకిటలాడుతోంది.

రైతుల దగ్గర నుంచి ఫ్రెష్ ఎలుకలను కొనుగోలు చేసిన దుకాణదారులు..వాటిని మాంసం కింద అమ్మేస్తుంటారు. వాటి మాంసం కొనడానికి జనాలు తెగ ఎగబడుతున్నారట. దీని వల్ల ఒకవైపు పంట కాపాడుకుంటూనే.. మరో వైపు వీటి తో సంపాదన చేసుకుంటున్నామని సంబరంగా చెబుతున్నారు. కోడి‌, పంది మాంసం కన్నా రోస్ట్‌ చేసిన, అప్పుడే పట్టిన ఎలుకలకు మంచి గిరాకీ ఉంటోండ‌టంతో కిలో రూ. 200 ప‌లుకుతోంది ఎలుక మాంసం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -